బాక్సాఫీస్ వసూళ్లపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • బాక్సాఫీస్ నెంబర్లు ముఖ్యమే కానీ విజయానికి కొలమానం కాదన్న చెర్రీ
  • భవిష్యత్తు చిత్రాల్లో ప్రయోగాలు చేయడానికి అవకాశం వస్తుందన్న రామ్ చరణ్
  • చిత్రం విజయాన్ని ఆ ఒక్క దానితో నిర్ణయించలేమని వ్యాఖ్య 
సినిమా రంగంలో బాక్సాఫీస్ నెంబర్లు ముఖ్యమేనని, కానీ చిత్ర విజయానికి అవొక్కటే కొలమానం కాదని ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ అన్నారు. జూన్ 4వ తేదీన ఆయన ప్రధానపాత్రలో నటించిన 'పెద్ది' చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. సినిమాల బాక్సాఫీస్ వసూళ్ళ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటులకు సినిమా కలెక్షన్లు ముఖ్యమేనని అన్నారు.

ఒక సినిమా బాక్సాఫీస్ వసూళ్లు బాగుంటే ఆ తర్వాత సినిమాలను కూడా అవి నిర్ణయిస్తాయని రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ఈ నెంబర్లు బాగుంటేనే భవిష్యత్తులో రాబోయే చిత్రాల్లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి అవకాశం వస్తుందని అన్నారు. ఇలాంటి వాటికి రికార్డులు, కలెక్షన్లు ముఖ్యమేనని, కానీ చిత్రం విజయాన్ని ఆ ఒక్క దానితో నిర్ణయించలేమని అన్నారు. 

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' చిత్రంలో జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ హాట్ కేకుల్లా జరుగుతున్నాయి. జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. ఈ షో టిక్కెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. సినిమా విడుదలయ్యే 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రస్తుతమున్న టిక్కెట్ ధరలపై సింగిల్ స్క్రీన్‌లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అనుమతించింది.

Ram Charan Teja
Peddi Movie
Ram Charan
Box Office Collections
Telugu Cinema
Buchi Babu Sana

More Telugu News