టాక్ తో సంబంధం లేని వసూళ్లతో 'దృశ్యం 3'

  • ఈ నెల 21న విడుదలైన 'దృశ్యం 3'
  • వారంలో రోజుల్లో 200 కోట్లకుపైగా వసూళ్లు
  • అమెజాన్ ప్రైమ్ కి స్ట్రీమింగ్ హక్కులు 
  • వచ్చేనెల చివరిలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్  
    

మోహన్ లాల్.. మీనా ప్రధానమైన పాత్రలను పోషించిన 'దృశ్యం 3', ఈ నెల 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం  వహించిన సినిమా ఇది. ఎప్పుడూ మలయాళంలో మోహన్ లాల్ చేయడం .. తెలుగు రీమేక్ వెంకటేశ్ చేస్తూ రావడం జరిగింది. కానీ ఈ సారి ఏమైందో తెలియదు గానీ, మోహన్ లాల్ సినిమానే అనువాదంతో తెలుగులో వదిలారు. కంటెంట్ కి ఉన్న క్రేజ్ కారణంగా, థియేటర్ల దగ్గర సందడి గట్టిగానే కనిపించింది.

'దృశ్యం 3' సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా వసూళ్ల పరంగా ఎంతవరకూ ముందుకు వెళుతుందనేది విషయంలో ఒక సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలివారంలో 200 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేస్తూ పోస్టర్ వదిలారు. ఈ సినిమా గురించి వ్యక్తమైన అభిప్రాయాలను చూస్తే, ఈ స్థాయి వసూళ్లు గొప్పగానే అనిపిస్తాయి.

దృశ్యం .. దృశ్యం 2 సినిమాలలో స్క్రీన్ ప్లే పరంగా జీతూ జోసెఫ్ ఒక మేజిక్ చేశాడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు ఆ ట్విస్టులను ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు. కానీ అలాంటి ఒక మేజిక్ ఆయన ఈ సినిమాలో చేయలేకపోయారు. సెకండాఫ్ కోసం ఫస్టాఫ్ ను లాగుతూ వచ్చాడనే ఒక విమర్శ బలంగా వినిపిస్తూ వచ్చింది. అయినా గతంలోని రెండు సినిమాలకి గల క్రేజ్ కారణంగా, ఈ సినిమా పట్ల ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు. అందుకే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని అంటున్నారు. జూన్ చివరి వారంలోగానీ .. జులై తొలివారంలోగాని ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' కి రానుందనే టాక్ వినిపిస్తోంది.


Mohanlal
Drishyam 3
Meena
Jeethu Joseph
Drishyam movie
Telugu movies
Box office collections
Amazon Prime
Telugu cinema
Movie review

More Telugu News