అసలు రాజస్థాన్ జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎలా వచ్చాడో తెలుసా?.. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
- దేశవాళీ క్రికెట్‌లో వైభవ్ ప్రతిభను గుర్తించిన ఆర్ఆర్ స్కౌట్ సమర్ ఖాద్రీ
- ఆర్ఆర్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచా ఏర్పాటు చేసిన ట్రయల్స్‌కు హాజరైన వైభవ్
- ట్రయల్స్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచిన వైనం
- వైభవ్‌ను 'జనరేషనల్ టాలెంట్' అని అభివర్ణించిన జుబిన్
- అతని కోసం రూ.10 కోట్లు సిద్ధం చేయాలని ఆర్ఆర్ యాజమాన్యానికి మెసేజ్
ఐపీఎల్‌లో కొత్త ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు ఎప్పుడూ ముందుంటుంది. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ వంటి ఎందరో యువ సంచలనాలను వెలుగులోకి తెచ్చిన ఆర్ఆర్... తాజాగా మరో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని ఎలా గుర్తించిందనే ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ స్కౌటింగ్ బృందంలో సభ్యుడైన సమర్ ఖాద్రీ, దేశవాళీ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ ఆటను తొలిసారి గమనించాడు. ఓ లోకల్ మ్యాచ్‌లో వైభవ్ అమాంతం వరుస సిక్సర్లు బాదాడం చూశాడు. అతని అసాధారణ ప్రతిభకు ముగ్ధుడయ్యాడు. ఈ విషయాన్ని వెంటనే ఆర్ఆర్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచా దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో జుబిన్, వైభవ్ కోసం ప్రత్యేకంగా ఒక ట్రయల్ ఏర్పాటు చేశాడు.
ఈ ట్రయల్స్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. వైభవ్ ఎదుర్కొన్న మొట్టమొదటి బంతినే సిక్సర్‌గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గతంలో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ కూడా ఆర్ఆర్ ట్రయల్స్‌లో తమ తొలి బంతికే సిక్సర్లు బాదడం విశేషం. ఈ అద్భుతమైన ప్రదర్శన చూసి జుబిన్ భరుచా అవాక్కయ్యాడు. వెంటనే అతను ఆర్ఆర్ యాజమాన్యానికి ఒక సందేశం పంపాడు. "వేలానికి రూ. 10 కోట్లు సిద్ధం చేయండి. మన ముందుకు ఒక 'జనరేషనల్ టాలెంట్' వస్తున్నాడు" అని అందులో పేర్కొన్నాడు. ఈ ఒక్క సంఘటనతో వైభవ్ ప్రతిభపై ఆర్ఆర్ యాజమాన్యానికి ఎంతటి నమ్మకం ఏర్పడిందో స్పష్టమవుతోంది.