మమతా బెనర్జీకి షాక్... పార్టీకి రాజీనామా చేసిన మహిళా ఎంపీ
- ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేసిన బరాసత్ ఎంపీ
- బరాసత్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కకోలి ఘోష్ దస్తికార్
- సీఎం అధ్యక్షతన జరిగిన పరిపాలనా సమావేశం అనంతరం ఈ నిర్ణయం
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బరాసత్ ఎంపీ కకోలి ఘోష్ దస్తికార్ టీఎంసీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల ఆమె టీఎంసీ బరాసత్ పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే పార్టీలోని అన్ని పదవుల నుంచి వైదొలగడం గమనార్హం.
బరాసత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఆమె ఎంపీగా గెలుపొందారు. ఇటీవల ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన కీలక పరిపాలన సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
పార్టీని వీడటం ఎంతో బాధాకరమని కకోలి ఘోష్ దస్తికార్ పేర్కొన్నారు. తాను అఖిల భారత తృణమూల్ మహిళా కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ పదవితో పాటు, పార్టీలోని ఇతర సంస్థాగత పదవులు, కమిటీలు, బాధ్యతల నుంచి తప్పుకున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు చెప్పారు. పార్టీకి చెందిన ఎంపీ... ఒక ఎంపీ మహిళా ఎంపీ పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై స్పందించనప్పుడు పార్టీలో ఎందుకు కొనసాగాలని అన్నారు. తనకు మమతా బెనర్జీ 1976 నుంచి తెలుసని, 1984 నుంచి ఆమెతో కలిసి పనిచేస్తున్నానని గుర్తు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తన విధేయతకు నాకు లభించిన బహుమతి ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు.