42 మంది పెళ్లికొడుకులు రెడీ... ఒక్క పెళ్లికూతురు లేదు... కొత్త స్కాం!
- మధ్యప్రదేశ్‌లో సామూహిక వివాహం పేరుతో భారీ మోసం
- పెళ్లి మండపానికి చేరుకున్న 42 మంది వరులకు షాక్
- రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసిన ముఠా
- మోడల్స్ ఫోటోలు చూపించి యువకులను నమ్మించిన కేటుగాళ్లు
- ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభం
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఒక సామూహిక వివాహం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఓ ఇంటి వాళ్లమవుతామన్న ఆశతో ఆదివారం నాడు పెళ్లి మండపానికి చేరుకున్న 42 మంది వరులు, వారి కుటుంబ సభ్యులకు తీవ్ర పరాభవం ఎదురైంది. అక్కడ వధువులు గానీ, వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు గానీ లేకపోవడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు.
వివరాల్లోకి వెళితే.. విదిశ జిల్లాకు చెందిన ముఖేశ్, అతని భార్య సునీతా దాస్ బైరాగి నేతృత్వంలోని మధ్యవర్తుల ముఠా ఈ మోసానికి పాల్పడింది. ఇండోర్‌లోని మాతృ ఛాయా ఆశ్రమం నుంచి అనాథ యువతులతో పెళ్లిళ్లు జరిపిస్తామని నమ్మబలికారు. ఒక్కో వరుడి నుంచి రూ.15,000 నుంచి రూ.25,000 వరకు 'రిజిస్ట్రేషన్ ఫీజు' పేరుతో వసూలు చేశారు. యువకులను నమ్మించడానికి ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన మోడల్స్ ఫోటోలను చూపించారు.
పెళ్లి బట్టలు, ఇతర ఖర్చులన్నీ తామే చూసుకుంటామని, వరులు సాధారణ దుస్తుల్లో వస్తే చాలని చెప్పడంతో చాలామంది వారి మాటలు నమ్మారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కొందరు కార్లు అద్దెకు తీసుకుని, బంధువులతో సహా దేవాస్‌లోని పెళ్లి వేదికకు చేరుకున్నారు. అయితే, తీరా అక్కడికి వచ్చాక నిర్వాహకులు ఎవరూ కనిపించలేదు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా బాధితుల ఆవేదనతో నిండిపోయింది.
ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులైన ముఖేశ్, అతని భార్యను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే, సామాజికంగా పరువు పోతుందనే భయంతో కేవలం 10 కుటుంబాలు మాత్రమే ఇప్పటివరకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్ల కోసం ఎదురుచూస్తున్న యువకుల బలహీనతను ఆసరాగా చేసుకుని జరుగుతున్న వ్యవస్థీకృత మోసాలకు అద్దం పడుతోంది.