ఫ్రాన్స్‌ను వణికిస్తున్న చైల్డ్ అబ్యూజ్ స్కాండల్
- స్కూల్ సిబ్బందిపై లైంగిక దాడుల ఆరోపణలు
- పారిస్‌లోని 84 ప్రీ స్కూళ్లలో దర్యాప్తు
- కోర్టుకు చేరిన డేవిడ్ జి అనే నిందితుడి కేసు
- నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
- తొలి మూడు నెలల్లో 78 మంది సిబ్బంది సస్పెన్షన్
- ఏటా 1.60 లక్షల మంది పిల్లలపై అకృత్యాలు
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అత్యంత కలకలం రేపుతున్న చిన్నారుల లైంగిక వేధింపుల కుంభకోణం (చైల్డ్ అబ్యూజ్ స్కాండల్) ఇప్పుడు ఆ దేశాన్ని వణికిస్తోంది. పాఠశాలలు, డేకేర్ సెంటర్లలో చిన్న పిల్లలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన సిబ్బంది.. చిన్నారులపై హింసకు పాల్పడటమే కాకుండా లైంగిక దాడులు, అత్యాచారాలకు ఒడిగట్టారనే ఆరోపణలపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాజధాని నగరవ్యాప్తంగా దాదాపు 84 ప్రిస్కూళ్లు, 20 ప్రైమరీ స్కూళ్లు, 10 డేకేర్ సెంటర్లలో ఈ దర్యాప్తు కొనసాగుతోందని పారిస్ ప్రాసిక్యూటర్ లోర్ బెక్యువా వెల్లడించారు.
లంచ్ బ్రేక్‌లు, విరామ సమయాలు, పిల్లలు నిద్రపోయే వేళల్లో వారిని చూసుకునే స్కూల్ మానిటర్లే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరు నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా కాకుండా స్థానిక సంస్థల ద్వారా నియమితులైన వారని తెలుస్తోంది. పిల్లలపై అరవడం, జుట్టు పట్టుకుని లాగడం, ఆహారం ఇవ్వకపోవడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ ఫిర్యాదులపై అధికారులు స్పందించడానికి నెలల సమయం పట్టిందని బాధితుల తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు.
కోర్టుకు చేరిన కేసు - పెరిగిన ప్రజాగ్రహం
ఈ స్కాండల్‌కు సంబంధించిన ఒక ప్రధాన కేసు విచారణ ఈ వారంలో పారిస్ కోర్టులో ప్రారంభం కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 36 ఏళ్ల స్కూల్ అసిస్టెంట్ డేవిడ్ జి.. 3 నుంచి 5 ఏళ్ల వయసున్న ఐదుగురు ప్రీ స్కూల్ చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఇద్దరు మహిళా సహోద్యోగులను వేధించాడనే ఆరోపణలపై కోర్టుకు హాజరయ్యాడు. నిందితుడు ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నప్పటికీ, చిన్నారులను తన ఒళ్లో కూర్చోబెట్టుకోవడం వంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 1.50 లక్షల యూరోల జరిమానా పడే అవకాశం ఉంది.

తీవ్ర మానసిక వేదనలో చిన్నారులు
ఈ అకృత్యాల కారణంగా చిన్నారులు తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక నిందితుడి వేధింపుల కారణంగా మూడేళ్ల బాలుడు స్కూల్‌కు వెళ్లడానికే భయపడిపోయాడని బాధితుల తరఫు లాయర్ లూయిస్ కైలీజ్ తెలిపారు. ఈ పరిణామాలపై రాజకీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో పారిస్ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ కఠిన చర్యలకు ఆదేశించారు. ఇందులో భాగంగా 2026 మొదటి మూడు నెలల్లోనే 78 మంది స్కూల్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. కాగా, ఫ్రాన్స్‌లో ప్రతి ఏటా దాదాపు 1,60,000 మంది చిన్నారులు అత్యాచారాలు, లైంగిక దాడుల బారిన పడుతున్నారని అక్కడి స్వతంత్ర కమిషన్ 'సీఐఐవీఐఎస్‌ఈ' (CIIVISE) అంచనా వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.