రూ.7 కోట్లతో సినిమా తీస్తే రూ.750 కోట్ల కలెక్షన్లు.. దుమ్మురేపుతున్న హాలీవుడ్ హారర్ మూవీ!
- రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హారర్ చిత్రం 'అబ్సెషన్'
- ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లోనే రూ.750 కోట్లకు పైగా వసూళ్లు
- పెట్టుబడిపై 10,000 శాతం లాభంతో బాక్సాఫీస్ సంచలనం
- లాభాల పరంగా భారీ బడ్జెట్ చిత్రాలను మించి సరికొత్త రికార్డు
- కొత్త దర్శకుడు కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం
2026లో బాక్సాఫీస్ వద్ద ఓ చిన్న సినిమా పెను సంచలనం సృష్టిస్తోంది. కేవలం 7 లక్షల 50 వేల డాలర్ల (సుమారు రూ.7 కోట్లు) అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన 'అబ్సెషన్' అనే హారర్ చిత్రం, విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.750 కోట్లు) పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
పెట్టుబడిపై ఏకంగా 10,000 శాతం (100 రెట్లు) లాభం సాధించి, ఈ ఏడాది అత్యంత లాభదాయక చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది విడుదలైన 'మైఖేల్', 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా లాభాల విషయంలో 'అబ్సెషన్' దరిదాపుల్లో లేకపోవడం విశేషం. ఆ చిత్రాలు తమ బడ్జెట్‌పై 3 నుంచి 5 రెట్ల లాభాన్ని మాత్రమే ఆర్జించగా, 'అబ్సెషన్' వంద రెట్ల లాభంతో రికార్డు సృష్టించింది. మౌత్ టాక్‌తో సినిమాకు ఆదరణ పెరుగుతుండటంతో రెండో వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగాయి.
కొత్త దర్శకుడు కర్రీ బార్కర్ దర్శకత్వం వహించడమే కాకుండా, కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవరెట్ ప్రధాన పాత్రలు పోషించారు. తన చిన్ననాటి క్రష్ ప్రేమను పొందేందుకు ఓ సంగీత దుకాణం ఉద్యోగి, అతీంద్రియ శక్తి ఉన్న బొమ్మను కొనడం, ఆ తర్వాత చోటుచేసుకునే భయానక పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
మే 15న విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికే మంచి సమీక్షలు అందుకుంది. ఈ జోరు కొనసాగితే, ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్లు వసూలు చేసిన మూడో అతి తక్కువ బడ్జెట్ చిత్రంగా ('పారానార్మల్ యాక్టివిటీ', 'ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్' తర్వాత) 'అబ్సెషన్' చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.