ట్విష శర్మ కేసులో కీలక పరిణామం.. రెండో పోస్టుమార్టం తర్వాత అంత్యక్రియలు
- నటి ట్విష శర్మ కేసుకు సంబంధించి రెండో పోస్టుమార్టం పూర్తి
- కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు హైకోర్టు ఆదేశాలు
- రెండు వారాల తర్వాత ట్విష శర్మ అంత్యక్రియలు
- కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
నటి ట్విష శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు నిన్న ట్విష మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం దాదాపు రెండు వారాల తర్వాత ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. మొదటి పోస్టుమార్టంపై అనుమానాలున్నాయని, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో మళ్లీ పరీక్ష జరిపించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.
మధ్యప్రదేశ్ హైకోర్టు జోక్యంతో ట్విష కుటుంబ సభ్యుల డిమాండ్‌కు ఆమోదం లభించింది. భోపాల్‌లోనే ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందంతో పోస్టుమార్టం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి నలుగురు వైద్యుల బృందం భోపాల్ చేరుకుంది. నిన్న మధ్యాహ్నం భోపాల్ ఎయిమ్స్‌లో రెండో పోస్టుమార్టం పూర్తి చేసి, మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. సాయంత్రం భద్భద విశ్రమ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.