ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసమే ఆడాను: రియాన్ పరాగ్

Riyan Parag Played for Team Despite Unfit Condition
  • ఫిట్‌గా లేనప్పటికీ జట్టు కోసం ఆడినట్లు చెప్పిన రియాన్ పరాగ్
  • గెలుపు క్రెడిట్ మొత్తం ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కేనన్న రాజస్థాన్ కెప్టెన్
  • కెప్టెన్‌గా గణాంకాల కన్నా అంచనాలనే నమ్ముతానని వెల్లడి
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో తాను పూర్తిగా ఫిట్‌గా లేకపోయినా బరిలోకి దిగానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సంచలన విషయం వెల్లడించాడు. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్ కావడంతో, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ రిస్క్ తీసుకున్నానని తెలిపాడు. ఈ గెలుపు క్రెడిట్ మొత్తం ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కే దక్కుతుందని ప్రశంసించాడు.

మ్యాచ్ అనంతరం పరాగ్ మాట్లాడుతూ.. "నేను ఈ మ్యాచ్‌కు ఫిట్‌గా లేను. ఈ మ్యాచ్‌తో పాటు మరో మ్యాచ్ కూడా ఆడొద్దని భావించాను. కానీ ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే సాహసం చేయాలనిపించింది. అందుకే ఆడాను. ఎలిమినేటర్ మ్యాచ్ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంటాను" అని స్పష్టం చేశాడు. 

కెప్టెన్‌గా తాను గణాంకాల కంటే పరిస్థితులను, తన అంచనాలనే ఎక్కువగా నమ్ముతానని చెప్పాడు. హార్దిక్ పాండ్యను ఔట్ చేయగలడనే నమ్మకంతోనే ఆర్చర్‌కు బంతినిచ్చానని, అది ఫలించిందని వివరించాడు. బ్యాటింగ్‌లోనూ ఆర్చర్‌ను ముందుకు పంపడం సరైన నిర్ణయమని, అతను 15 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు.
Go Back to Shorts
Riyan Parag
Rajasthan Royals
Mumbai Indians
IPL 2026
Jofra Archer
Hardik Pandya
Playoffs
Cricket
Indian Premier League
RR vs MI

More Telugu News