విజయ్ 'జన నాయగన్'.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?

Vijay Jana Nayagan New Release Date Fixed
  • విజయ్ 'జన నాయగన్' విడుదలకు సిద్ధం
  • పుట్టినరోజు సందర్భంగా జూన్ 19న రిలీజ్ ప్లాన్
  • ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌లో కనిపించిన విడుదల తేదీ
  • అధికారిక ప్రకటన కోసం అభిమానుల ఎదురుచూపు
తమిళ అగ్ర నటుడు, ఇళయ దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, ఈ సినిమా రిలీజ్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా కొత్త విడుదల తేదీపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో దానికి కానుకగా మూడు రోజుల ముందే సినిమాను తీసుకురావాలని భావిస్తున్నారట. ఇప్పటికే కొన్ని ఆన్‌లైన్ టికెటింగ్ యాప్స్‌లో విడుదల తేదీగా జూన్ 19ని పేర్కొనడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'కి రీమేక్ అనే ప్రచారం ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మమితా బైజు ఓ కీలక పాత్రలో కనిపించనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
Go Back to Shorts
Jana Nayagan
Vijay
Vijay movie
Tamil Nadu
Bhagavanth Kesari remake
Pooja Hegde
Mamitha Baiju
H Vinoth
KVN Productions

More Telugu News