'పెద్ది' కచ్చితంగా మీ మనసులను తాకే సినిమా... నా కెరీర్‌లో నెంబర్ వన్ ఇదే: భోపాల్ లో రామ్ చరణ్
- భోపాల్ లో 'పెద్ది' చిత్రం ఈవెంట్
- హిందీలో ప్రసంగించిన రామ్ చరణ్
- నా చిత్రాల లైబ్రరీలో 'పెద్ది' మొదటి స్థానంలో ఉంటుందని వెల్లడి
- ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు, ఒక వ్యక్తి గుర్తింపు కోసం చేసే ప్రయాణం
- షూటింగ్‌లో తగిలిన గాయాలను సినిమా ఇచ్చిన జ్ఞాపకాలుగా అభివర్ణన
- మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, చిత్ర బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 'పెద్ది కీ ఆవాజ్' కార్యక్రమంలో రామ్‌చరణ్ సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్ లో రామ్ చరణ్ హిందీలో ప్రసంగించడం హైలైట్ గా నిలిచింది.
"నమస్కారం భోపాల్! నమస్కారం మధ్యప్రదేశ్!... ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా హిందీ కొంచెం వీక్ గా ఉండొచ్చు. కానీ, నా హృదయంలో మీకు చాలా చాలా పెద్ద స్థానం ఉంది. దయచేసి నా భాషను కాదు, నా భావాలను అర్థం చేసుకోండి. నిజం చెప్పాలంటే, 'పెద్ది' సినిమా ప్రమోషన్లను భోపాల్‌లో ప్రారంభించడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు.
ఈ సినిమాను మేం చాలా మనసు పెట్టి తీశాం. మాలోని ప్రతి ఎమోషన్, ప్రతి సంఘర్షణ, మా కలలు.. అన్నీ ఈ సినిమాలో పెట్టేశాం. ఆ సినిమాను మీ ముందుకు తీసుకురావాలనే ప్రేమతోనే మేమంతా ఇక్కడికి వచ్చాం. భోపాల్ ఎంత పెద్ద నగరమో, అంతకంటే పరిశుభ్రమైన నగరం. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. ఇక్కడి సరస్సుల కంటే మీ మనసులు చాలా పెద్దవి, అందమైనవి. మీ అందరి హృదయాల్లో మా సినిమాకు ఒక చిన్న చోటివ్వండి. జూన్ 4న తప్పకుండా థియేటర్లలో సినిమాను చూడండి.
ఇక రవికిషన్ జీ మాట్లాడిన తర్వాత మేం మాట్లాడాల్సిన అవసరం లేదు. మా సినిమా గురించి, మా గురించి ఆయన ఎంతో అద్భుతంగా మాట్లాడారు. రవికిషన్ జీ, మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మధ్యప్రదేశ్‌ను మన దేశానికి గుండెచప్పుడు అంటారు. ఇప్పుడు నాకు అర్థమవుతోంది, భోపాల్ మధ్యప్రదేశ్‌కు గుండె లాంటిదని. అందుకే మేమంతా ఇక్కడికి చేతులు జోడించి వచ్చాం. మా సినిమాను మీ పెద్ద మనసుతో స్వీకరించండి.
'పెద్ది' కేవలం ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు, అంతకుమించి ఒక వ్యక్తి తన అస్తిత్వాన్ని, గుర్తింపును వెతుక్కునే కథ ఇది. ఈ కథ కచ్చితంగా మీ మనసులను తాకుతుంది, మీకు స్ఫూర్తినిస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. దయచేసి పిల్లలను కూడా సినిమాకు తీసుకురండి. రవికిషన్ జీ చెప్పినట్లు ఇది ప్రతి పిల్లాడికి స్ఫూర్తినిచ్చే సినిమా. మేం పడిన కష్టం ఈ హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా నుంచి మీ ప్రమోషన్ల ద్వారా, మీ మొబైల్స్ ద్వారా దేశం మొత్తానికి చేరుతుందని ఆశిస్తున్నాను.
ఒక విషయం నేను చాలా గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమా చేసిన తర్వాత, నా ఫిల్మ్ లైబ్రరీలో ఎన్ని సినిమాలు ఉన్నా, 'పెద్ది' నా కెరీర్‌లో నంబర్ వన్ చిత్రంగా నిలిచిపోతుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మా కష్టాన్ని, మా మనసును మీరు ఫీల్ అవుతారు. మా నిర్మాత సతీశ్ కిలారి గారికి, మా ప్రియమైన దర్శకుడు బుచ్చిబాబు గారికి, నా సహనటి జాన్వి గారికి, దేవేందు జీకి, లెజెండరీ యాక్టర్ రవికిషన్ జీకి, ఈ సినిమాకు అతిపెద్ద బలం అయిన మా రెహమాన్ సాబ్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు అవినాశ్ జీ, డీఓపీ రత్నవేలు సర్, ఇతర నటీనటులు, సిబ్బందికి, భోపాల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మినిస్టర్ సర్జన్ గారికి, ముఖ్యమంత్రి యాదవ్ గారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
భోపాల్ గుర్తుంచుకోండి, నేను మళ్లీ వస్తాను. మీతో కలిసి ఇక్కడ సక్సెస్ టూర్ కూడా చేస్తాను. ఇన్నేళ్లుగా 'ఆర్ఆర్ఆర్' వరకు మీరు నాపై చూపించిన ప్రేమను ఈ సినిమాకు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సురక్షితంగా ఇళ్లకు వెళ్లండి. మీ కుటుంబం కూడా ఎప్పుడూ సురక్షితంగా ఉండాలి" అంటూ రామ్ చరణ్ తన ప్రసంగాన్ని ముగించారు.
ప్రతి ఫ్రేమ్ లో రామ్ చరణ్ 100 శాతం అంకితభావం చూపించాడు: ఏఆర్ రెహమాన్
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, "ప్రతి ఫ్రేమ్‌లో రామ్‌చరణ్ 100 శాతం అంకితభావం చూపించారు. ఆయన నటన, డ్యాన్స్ నా పాటలకు కొత్త అందాన్ని తెచ్చాయి. సినిమాలో నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది" అని అన్నారు.
మరోవైపు, ప్రముఖ నటుడు రవికిషన్ మాట్లాడుతూ, "‘3 ఇడియట్స్’, ‘దంగల్’ చిత్రాల తరహాలో ‘పెద్ది’ కూడా చర్చనీయాంశమవుతుంది. యువతను ఉత్తేజపరిచే ఈ చిత్రానికి జాతీయ అవార్డుతో పాటు అన్ని పురస్కారాలు రావడం ఖాయం" అని జోస్యం చెప్పారు.
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.