‘నేను తప్పిపోయి రాలేదు..’.. అఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ విడుదల

  • అఖిల్‌ హీరోగా ‘లెనిన్‌’ చిత్రం
  • జూన్‌ 26న సినిమా విడుదల
  • నాగార్జున 40 ఏళ్ల పండగ సందర్భంగా టీజర్‌
  • అఖిల్‌ పవర్‌ఫుల్‌ డైలాగులు హైలైట్‌
  • చిత్రబృందాన్ని అభినందించిన నాగార్జున
అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌’. మురళీకిశోర్‌ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఆకట్టుకుంటున్న డైలాగులు
ఈ టీజర్‌లో అఖిల్‌ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ‘మనోడు వస్తున్నాడు..’, ‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా’ అంటూ అఖిల్‌ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌తో రొమాన్స్‌, ‘యాడికమ్మీ పోతుండావు.. ఈరోజు అటో ఇటో తేల్చేద్దామూ’ అంటూ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పడం బాగుంది. చివర్లో యాక్షన్‌ సీన్లు సినిమాపై అంచనాలను పెంచేసింది.

నాగార్జున సర్‌ప్రైజ్‌
ఈ టీజర్‌ను నాగార్జున సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నాకు మంచి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు’ అంటూ చిత్రబృందాన్ని అభినందించారు. టీజర్ చూస్తున్నంతసేపు చాలా హాయిగా అనిపించిందని నాగార్జున తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.








Akhil Akkineni
Lenin Movie
Akhil Lenin Teaser
Nagarjuna Akkineni
Murali Kishore Abburu
Telugu cinema
Tollywood
June 26 release
Action Romance movie
Rayalaseema dialect

More Telugu News