అమితాబ్, ఆమిర్‌ఖాన్ సహ నటుడు.. హత్య కేసులో జీవిత ఖైదీ!
- హత్య కేసులో అరెస్ట్ అయి.. పెరోల్‌పై 12 ఏళ్ల క్రితం విడుదల
- పరారీలో ఉంటూనే బాలీవుడ్ సినిమాల్లో నటన
- అమితాబ్, ఆమిర్‌ఖాన్ చిత్రాల్లోనూ కనిపించిన నిందితుడు
- అహ్మదాబాద్‌లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కిన ఖైదీ
హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై విడుదలై పుష్కరకాలంగా పరారీలో ఉన్న ఓ నటుడిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సమయంలో అతడు అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్, రణ్‌వీర్ సింగ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించడం గమనార్హం.
హేమంత్ నాగిందాస్ పురుషోత్తందాస్ అలియాస్ హేమంత్ మోదీ (53) అనే వ్యక్తిని అహ్మదాబాద్‌లోని ఘీకాంటా మెట్రో స్టేషన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2005లో అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో జరిగిన ఓ భూవివాదంలో నరేంద్ర అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హేమంత్‌ను దోషిగా తేల్చిన కోర్టు 2008లో జీవిత ఖైదు విధించింది.
మెహసానా జైలులో శిక్ష అనుభవిస్తున్న హేమంత్‌కు 2014లో గుజరాత్ హైకోర్టు 30 రోజుల పరోల్ మంజూరు చేసింది. గడువు ముగిసినా తిరిగి జైలుకు రాకుండా అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు.
గత పదేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి ముంబైలో నటుడిగా జీవితం కొనసాగించాడు. ఈ క్రమంలో అమితాబ్, ఆమిర్‌ఖాన్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్', రణ్‌వీర్ సింగ్ నటించిన 'జయేష్‌భాయ్ జోర్దార్' వంటి చిత్రాలతో పాటు 'వాగ్లే కి దునియా' వంటి టీవీ షోలలో కూడా పనిచేశాడు. త్వరలో విడుదలకానున్న 'లాహోర్ 1947', మలయాళ చిత్రం 'L2: ఎంపురాన్'లో కూడా నటించినట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో నిందితుడిని ట్రాక్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. 12 ఏళ్ల తర్వాత అతడిని అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.