తమిళనాడులో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు మంత్రి పదవి.. ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర ఘటన
- విజయ్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన ఎస్. రాజేశ్ కుమార్
- ప్రమాణ స్వీకారం చివర్లో నినాదాలు చేయడంతో గవర్నర్ అభ్యంతరం
- అది ప్రమాణంలో భాగం కాదంటూ చిరునవ్వుతో హెచ్చరించిన గవర్నర్
- డీఎంకేతో 20 ఏళ్ల పొత్తు తెంచుకుని విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు
తమిళనాడు రాజకీయాల్లో ఆరు దశాబ్దాల తర్వాత ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సుదీర్ఘ విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయింది. అయితే, ఈ చారిత్రక ఘట్టం ఒక ఆసక్తికర సన్నివేశానికి, చిన్నపాటి వివాదానికి వేదికైంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ప్రమాణం ముగిశాక పార్టీ నేతల పేర్లతో నినాదాలు చేయగా, గవర్నర్ చిరునవ్వుతోనే సున్నితంగా హెచ్చరించారు.
నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత, కిళియూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్. రాజేశ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ పత్రంలోని వాక్యాలు చదివి పూర్తిచేసిన వెంటనే ఆయన, "కామరాజ్ నామం వర్ధిల్లాలి, భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధిల్లాలి, ప్రజా నేత రాహుల్ గాంధీ వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేశారు.
దీంతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వెంటనే స్పందించారు. "అది మీ ప్రమాణంలో భాగం కాదు" అని చిరునవ్వుతో చురక అంటించారు. గవర్నర్ వ్యాఖ్యకు రాజేశ్ కుమార్ కూడా నవ్వుతూనే బదులిచ్చి, పత్రాలపై సంతకం చేసేందుకు ముందుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1967 తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం పంచుకోవడం ఇదే ప్రథమం. ఇటీవలి ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మెజారిటీకి కొద్ది సీట్లు తక్కువయ్యాయి. ఈ క్రమంలో 20 ఏళ్లుగా మిత్రపక్షంగా ఉన్న డీఎంకేతో బంధం తెంచుకుని, టీవీకే ప్రభుత్వానికి ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. డీఎంకే మిత్రపక్షంగా ఉన్నప్పటికీ గతంలో వారి మంత్రివర్గంలో కాంగ్రెస్కు ఎప్పుడూ చోటు దక్కలేదు.
మే 10న విజయ్ తొమ్మిది మంది మంత్రులతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, గురువారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి.