సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ వివరణ
- అసెంబ్లీలో సనాతన ధర్మంపై స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు
- ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదనేది తన వ్యాఖ్యల అర్థం కాదన్న ఉదయనిధి
- కుల వ్యవస్థను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్య
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో, ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
2026 ఎన్నికల తర్వాత డీఎంకే ప్రతిపక్షంలోకి రావడంతో, ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సీఎం విజయ్ సమక్షంలోనే ఉదయనిధి సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉదయనిధి వ్యాఖ్యలు హిందూ విశ్వాసాలను కించపరిచేలా ఉన్నాయని, ఇది విభజన రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ తీవ్రంగా మండిపడింది.