నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం.. అన్నపూర్ణ స్యూడియోస్ ఏమన్నదంటే?
- సింగిల్ స్క్రీన్ పర్సెంటేజీ విధానం అమలు అంశంపై వివాదం
- పరిశ్రమ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామన్న అన్నపూర్ణ స్టూడియోస్
- తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాలు, మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు వెల్లడి
సింగిల్ స్క్రీన్ పర్సెంటేజీ విధానం అమలు అంశంపై తెలంగాణ ఎగ్జిబిటర్లు, టాలీవుడ్ నిర్మాతల మధ్య వివాదం నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ స్పందించింది. చిత్ర పరిశ్రమ ప్రయోజనాలకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాలు, మార్గదర్శకాలను పాటిస్తున్నామని వెల్లడించింది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విధానాల మేరకే తమ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పనిచేస్తోందని స్పష్టం చేసింది. కొన్నాళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నామని, భవిష్యత్తులోను దీనికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానం అమలు అంశంపై తెలంగాణ ఎగ్జిబిటర్లు, టాలీవుడ్ నిర్మాతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పర్సంటేజీ విధానంలోకి వచ్చిన వారి సినిమాలనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. నిర్మాతలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి, పెద్ది సినిమా విడుదలకు ముందు ఇలాంటి పద్దతి సరికాదని పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్ నిర్వహించి, నిర్మాతల తీరును తప్పుబట్టింది. ఈ పరిణామాలపై ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పైవిధంగా స్పందించింది.