సంజూ శాంసన్ చాలా సింపుల్... వీడియో ఇదిగో!

  • నిరాడంబరతతో సీఎస్కే అభిమానుల మనసు గెలుచుకున్న శాంసన్
  • బీచ్‌లో సరదాగా ఆడుకుంటున్న గ్రూప్‌తో కలిసి క్రికెట్ ఆడిన సంజు
  • శాంసన్ నిరాడంబరతపై నెటిజన్ల ప్రశంస
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తన నిరాడంబరతతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. తమిళనాడులోని ఒక బీచ్‌లో సరదాగా క్రికెట్ ఆడుతున్న కొంతమందిని చూశాడు. సంజు కూడా సాధారణ వ్యక్తిలా వారితో జత కలిశాడు. వారు బౌలింగ్ చేస్తుంటే బ్యాటింగ్ చేసి అందరినీ ఆలరించాడు. క్రికెట్ అభిమానులతో సరదాగా గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సంజు శాంసన్ నిరాడంబరతను ప్రశంసిస్తున్నారు.

అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన సంజు శాంసన్, ఐపీఎల్ 2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు. అప్పటి నుంచి చెన్నై చెట్టాన్ (అన్న)గా మారిపోయాడు. ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ లోకల్ సీఎస్కే అభిమానులతో మమేకమయ్యే ఉద్దేశంతో స్థానికులతో కలిసి బీచ్‌లో క్రికెట్ ఆడాడు. శాంసన్ ఎలాంటి భద్రత లేకుండా అక్కడకు వచ్చాడు. ప్రముఖ క్రికెటర్‌ను అనే ఆలోచనకు దూరంగా, అభిమానులతో కలిసిపోయి క్రికెట్ ఆడాడు.

Sanju Samson
Chennai Super Kings
CSK
IPL 2026
Tamil Nadu
Beach Cricket
Rajasthan Royals

More Telugu News