ఓటీటీకి వచ్చేసిన మలయాళ థ్రిల్లర్!
- మలయాళంలో రూపొందిన సినిమా
- ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ
- ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్
- త్వరలో తెలుగులో అందుబాటులోకి
ఓటీటీ సెంటర్లకు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ దిగిపోతూ ఉంటుంది. అయితే మలయాళం నుంచి ఏయే సినిమాలు వచ్చాయి .. ఏయే సిరీస్ లు వచ్చాయనేది ప్రేక్షకులు తప్పకుండా సెర్చ్ చేస్తారు. ఇక క్రైమ్ థ్రిల్లర్ .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ నుంచి ఏమైనా సినిమాలు వచ్చాయంటే ఎగిరిగంతేస్తారు. అందుకు కారణం ఆ జోనర్ కి చెందిన సినిమాలను వాళ్లు చాలా ఇంట్రస్టింగ్ గా ఆవిష్కరిస్తారనే ఒక బలమైన నమ్మకమే.
అలాంటి ఆడియన్స్ కోసమే అన్నట్టుగా ఈ వారం మలయాళం నుంచి ఒక సినిమా వచ్చింది .. దాని పేరే,'ఒరు దురూహ సాహచర్యత్తిల్'. రితీశ్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఏప్రిల్ 15వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం మలయాళంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాలో 'సేతు' అని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కుంచాకో బోబన్ కనిపించనున్నాడు. ఉద్యోగ రీత్యా ఆయన ఫారెస్టు ప్రాంతంలో ఉండవలసి వస్తుంది. అయితే ఒక రోజున ఒక వ్యక్తి అతనికి తారసపడతాడు. అతనికి సేతు ఆశ్రయం ఇస్తాడు. ఫలితంగా అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనేదే కథ. కుంచాకో బోబన్ .. దిలీష్ పోతన్ .. సాజిన్ గోపు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.