ఐఆర్జీసీని టార్గెట్ చేసిన అమెరికా... రూ.145 కోట్ల బంపర్ బొనాంజా ప్రకటన

  • అమెరికా, ఇరాన్ మధ్య ఆలస్యమవుతున్న శాంతి ఒప్పందం
  • ఈ క్రమంలో ఐఆర్‌జీసీకి సంబంధించి అమెరికా ఆఫర్
  • గల్ఫ్ దేశాలపై దాడులు చేయకుండా, అణు కార్యక్రమాలు చేపట్టకుండా దెబ్బతీయడమే లక్ష్యమని వెల్లడి
ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఆర్థిక మూలాల గురించి సమాచారం ఇచ్చిన వారికి 15 మిలియన్ డాలర్ల బహుమతిని ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ భారీ ఆఫర్ ఇచ్చింది. ఇది మన కరెన్సీలో సుమారు రూ.145 కోట్లు ఉంటుంది. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా, ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో పురోగతి కనిపించడంలేదు. యుద్ధాన్ని ముగించడానికి వాషింగ్టన్ చేసిన ప్రతిపాదనలను టెహ్రాన్ అంగీకరించలేదు. దీంతో ఒప్పందం ఆలస్యమవుతోంది.

ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ భారీ ఆఫర్ ఇచ్చింది. ఐఆర్‌జీసీ, దాని సంబంధిత శాఖలకు కీలక ఆర్థిక వనరులను అందించే బినామీ కంపెనీలు, వ్యక్తులు, ఆర్థిక సంస్థల సమాచారాన్ని తమకు తెలియజేయాలని కోరింది. గల్ఫ్ దేశాలపై దాడులు చేయకుండా, అణు కార్యక్రమాలు చేపట్టకుండా ఇరాన్‌ను దెబ్బతీయడమే లక్ష్యమని స్పష్టం చేసింది.

మరోవైపు, యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన ప్రతి అవకాశాన్ని తాము వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఏ విధమైన దురాక్రమణకైనా తగిన గుణపాఠం చెప్పేందుకు తమ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తప్పుడు అంచనాలు, తప్పుడు నిర్ణయాలు ఎల్లప్పుడూ తప్పుడు ఫలితాలనే ఇస్తుందని అన్నారు. చర్చల్లో భాగంగా తమ ప్రతిపాదనలను అమెరికా అంగీకరించాల్సిందేనని, మరో మార్గం లేదని స్పష్టం చేశారు.

IRGC
Iran Islamic Revolutionary Guard Corps
United States
Iran
US Department of State
Mohammad Bagher Ghalibaf

More Telugu News