నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేత

  • బలవంతపు మతమార్పిళ్ళ కేసులో నిందితురాలు నిదాఖాన్‌కు మజ్లిస్ కార్పొరేటర్ ఆశ్రయం
  • అక్రమ ఇల్లు, కార్యాలయ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు
  • వివరణ కోసం సమయం కోరిన కార్పొరేటర్ మతిన్ పటేల్
  • పిటిషన్‌ను తోసిపుచ్చిన స్థానిక కోర్టు
మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ళ కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు. కార్పొరేటర్ తన ఇంటిని, కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

అక్రమ నిర్మాణాలకు సంబంధించి వివరణ కావాలని మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు ఇచ్చింది. అయితే ఈ నిర్మాణాలపై తాను సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరుతూ మతిన్ పటేల్ పిటిషన్ దాఖలు చేయగా, స్థానిక కోర్టు తిరస్కరించింది. దీంతో ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం ఆయన ఇంటిని, కార్యాలయాన్ని కూల్చివేసింది.

తన ఇంట్లో నిదాఖాన్‌కు ఆశ్రయమివ్వడంతో మతిన్ పటేల్ అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి మే 9వ తేదీన మతిన్ పటేల్‌కు మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు జారీ చేసింది. నరేగావ్ ప్రాంతంలోని కౌసర్ పార్కులో మతిన్ పటేల్‌కు చెందిన 600 చదరపు అడుగుల ఇంటికి సంబంధించి అనుమతి పత్రాలను సమర్పించాలని ఈ నోటీసుల్లో పేర్కొంది.

నిదాఖాన్ అరెస్టుకు ముందు ఈ ఇంట్లోనే తలదాచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్మాణం అక్రమమని, 72 గంటల్లో వివరణ సమర్పించాలని మతిన్ పటేల్‌కు కార్పొరేషన్ సూచించింది. అయితే ఆయన ఆయన కోర్టుకు వెళ్లడం, ఆ పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో బుల్డోజర్‌తో కూల్చివేశారు.

Nida Khan
Matin Patel
Nashik TCS
illegal construction
house demolition
Aurangabad Municipal Corporation

More Telugu News