అసోం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, లోకేష్... ఫొటో రౌండప్!

  • అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, లోకేష్
  • ఈ కార్యక్రమానికి పలువురు ఎన్డీఏ నేతలు హాజరు
  • కూటమి పాలిత రాష్ట్రాల సీఎంలతో చంద్రబాబు, లోకేష్ సంభాషణ
  • కేంద్ర మంత్రులతోనూ సరదాగా ముచ్చటించిన నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అసోంలో పర్యటించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిద్దరూ హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశంలోని పలువురు ఎన్డీఏ నేతలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో చంద్రబాబు, లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులతో వారు సరదాగా ముచ్చటించారు. ఈ కార్యక్రమం ఎన్డీఏ కూటమి నేతల మధ్య స్నేహపూర్వక భేటీకి వేదికగా మారింది.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్య నేతలతో చంద్రబాబు, లోకేష్ ఆత్మీయంగా సంభాషిస్తూ కనిపించారు. ఈ పర్యటన ద్వారా జాతీయ స్థాయిలో కూటమి నేతలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నట్లయింది.

Chandrababu Naidu
Nara Lokesh
Assam CM
Himanta Biswa Sarma
Oath Ceremony
NDA Meeting
Andhra Pradesh
Political News
Narendra Modi
Amit Shah

More Telugu News