నీట్ పేపర్ లీకేజీ, రద్దు... కేంద్రంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆగ్రహం
- పరీక్ష రద్దు కేంద్రం వైఫల్యమన్న కేటీఆర్
- 2024లో కూడా ప్రశ్నాపత్రం లీకైందన్న కేటీఆర్
వైద్య విద్య జాతీయ అర్హత పరీక్ష (నీట్-యూజీ) 2026 పరీక్ష రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా పరీక్ష రద్దు పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. ఇది కేంద్రానికి సిగ్గుచేటు అన్నారు.
ఎన్డీయే వైఫల్యం విద్యార్థులకు శాపంగా మారిందని అన్నారు. ఏకంగా వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ అయ్యాయని ఆరోపించారు. కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కూడా ప్రశ్నాపత్రం లీకైందని గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వైఫల్యం వల్లే మరోసారి అలాంటి పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.
నీట్ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు మానసిక వేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష లీకేజీతో ప్రతి దశలో మోసాలు కనబడుతున్నాయని విమర్శించారు. నీట్ పరీక్ష వ్యవస్థే పెద్ద కుంభకోణమని, ప్రతి సంవత్సరం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ప్లస్ టూ పరీక్షల్లో స్కోర్ ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు కేటాయించే పాత విధానం తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు.