సీఎంగా విజయ్ ప్రమాణం.. 'ప్రేమ గట్టిగా వినిపిస్తుంది' అంటూ త్రిష పోస్ట్

After Vijay swears in as the 13th CM of TN Trisha posts love is always louder
  • విజయ్ ప్రమాణస్వీకార వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష
  • 'ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
  • విజయ్, త్రిష మధ్య ప్రేమాయణంపై మళ్లీ ఊహాగానాలు
తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ ప్రమాణస్వీకారం చేయగా, ఈ కార్యక్రమానికి ఆయన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్, నటి త్రిష కృష్ణన్ హాజరవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిన్న‌ చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ వేడుక తర్వాత త్రిష సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తన ఫొటోలను షేర్ చేస్తూ, "ప్రేమ ఎప్పుడూ గట్టిగానే వినిపిస్తుంది" (The love is always louder) అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్యాప్షన్ వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.

వేడుక కోసం త్రిష సీఫామ్-గ్రీన్ రంగు చీరలో, బంగారు వర్ణం మోటిఫ్స్ ఉన్న బ్లౌజ్‌తో సంప్రదాయబద్ధంగా ముస్తాబయ్యారు. తలలో తెల్లటి గజ్రా, ఎరుపు రాళ్లతో కూడిన ఆభరణాలతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

కాగా, విజయ్, త్రిష తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీలలో ఒకటి. గతంలో 'గిల్లీ', 'తిరుపాచ్చి', 'ఆతి', 'కురువి', ఇటీవల వచ్చిన 'లియో' వంటి చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నప్పటికీ, ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. విజయ్ విడాకుల పిటిషన్‌కు సంబంధించిన వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఈ వదంతులు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న చారిత్రక ఘట్టానికి త్రిష హాజరుకావడం, ఆ త‌ర్వాత ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Trisha Krishnan
Vijay
Vijay actor
Tamil Nadu CM
Kollywood
Tamil cinema
Vijay Trisha relationship
Leo movie
Tamil Nadu politics
Chennai

More Telugu News