తెలంగాణలో పర్యటన.. ప్రధాని మోదీకి కవిత బహిరంగ లేఖ

  • తెలంగాణ ప్రయోజనాల కోసం నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి
  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి
  • ఓబీసీ ఉపకోటాతో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరిగి ప్రవేశపెట్టాలన్న కవిత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (మే 10) తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మోదీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలు, దేశంలో సామాజిక న్యాయ సాధనకు సంబంధించిన నాలుగు కీలక అంశాలను తక్షణమే పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

తెలంగాణ ప్రజలకు, భారతదేశంలో విస్తృత సామాజిక న్యాయ సాధనకు అత్యంత కీలకమైన నాలుగు విషయాలను ఒక బాధ్యత కలిగిన పౌరురాలిగా మీ దృష్టికి తీసుకువస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీటి పారుదల పథకానికి జాతీయహోదా కల్పించాలని కోరారు.
- 2027 జనాభా లెక్కలలో ప్రత్యేక ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
- ఓబీసీ ఉప కోటాతో మహిళా రిజర్వేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు.
- తెలంగాణలో వెనుకబడిన తరగతుల బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ లేఖలో కోరారు.

జలభద్రత, డేటా ఆధారిత న్యాయం, లింగ సమానత్వం, రాజ్యాంగ రక్షణలు అనే నాలుగు మూలస్తంభాలను పరిష్కరించడం మన దేశ సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడంలో ఎంతగానో దోహదపడుతుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. తాను సూచించిన అభ్యర్థనలపై సానుకూలంగా పరిశీలిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Kalvakuntla Kavitha
PM Modi Telangana Visit
Telangana
BRS
Palamuru Rangareddy Project
OBC Census

More Telugu News