తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వేళ... పళనిసామి ఆసక్తికర ట్వీట్

  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీకి అభినందనలు తెలిపిన పళనిసామి
  • ఏ పార్టీ పేరును ప్రస్తావించకుండా అభినందనలు
  • విజయ్, వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం రోజులవుతున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత పళనిసామి చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆయన ఏ పార్టీ పేరును ప్రస్తావించకుండా, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీకి పళనిసామి అభినందనలు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. వివిధ పార్టీల అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించారని, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

పళనిసామి ట్వీట్ నేపథ్యంలో, టీవీకే, వీసీకే పొత్తు ఖాయమైనట్లుగా భావిస్తున్నారు. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈరోజు మరోసారి గవర్నర్‌ను కలవనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన విషయం తెలిసిందే. కానీ మెజారిటీకి కొన్ని సీట్లు తగ్గడంతో చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Palaniswami
Tamil Nadu Government Formation
Tamil Nadu Assembly Elections
AIADMK
TVK Party
Vijay

More Telugu News