విజయ్ గురించి నటి లైలా ఏమన్నారంటే..!
- విజయ్‌తో కలిసి గతంలో నటించిన లైలా
- విజయ్ సహృదయుడని ప్రశంస
- ఆయన పాలకుడిగా రావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని వ్యాఖ్య
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన విజయ్ కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా విజయ్‌తో గతంలో స్క్రీన్ పంచుకున్న నటి లైలా ఆయన వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యల చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో లైలా మాట్లాడుతూ... విజయ్ కేవలం గొప్ప నటుడు మాత్రమే కాదని, అంతకు మించి ఒక సహృదయుడని కొనియాడారు. తోటి వారికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి పాలకుడిగా రావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని అన్నారు. సినిమాల్లో ఆయన ప్రదర్శించే క్రమశిక్షణ, అంకితభావం ఇప్పుడు ప్రజా సేవలో కూడా ప్రతిబింబిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన ‘గోదారి గట్టుపైన’ చిత్రం నిన్ననే (మే 8) విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో లైలా పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన ఆమె, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.