విజయ్ మంత్రివర్గంలో మేం చేరబోం... బయటి నుంచే మద్దతిస్తాం... వామపక్షాల సంచలన నిర్ణయం!

Vijays Government Left Parties to Support from Outside
  • విజయ్ పార్టీకి మద్దతివ్వాలని వామపక్షాల నిర్ణయం
  • ప్రభుత్వంలో చేరబోమని, మంత్రి పదవులు వద్దని స్పష్టీకరణ
  • బయటి నుంచే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని ఉద్ఘాటన 
  • మతవాద శక్తులను అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటన
  • డీఎంకేతో తమ స్నేహం కొనసాగుతుందని వెల్లడి
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఇచ్చేందుకు వామపక్ష పార్టీలు (సీపీఐ, సీపీఎం) ముందుకు వచ్చాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామే తప్ప, కేబినెట్‌లో చేరి మంత్రి పదవులు చేపట్టబోమని స్పష్టం చేశాయి. టీవీకే పార్టీకి బయటి నుంచే మద్దతు ఇస్తామని ఉద్ఘాటించాయి.

రాష్ట్రంలో మతవాద శక్తులు పాగా వేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా మతతత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించాయి.

అదే సమయంలో, తమ చిరకాల మిత్రపక్షమైన డీఎంకేతో బంధం కొనసాగుతుందని వామపక్షాలు స్పష్టం చేయడం గమనార్హం. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎంకేతో కలిసి పనిచేస్తామని తెలిపాయి. 

Go Back to Shorts
Vijay
Tamilaga Vetri Kazhagam
TVK
Tamil Nadu Politics
Left Parties
CPI
CPM
DMK
Political Support
மதவாத சக்திகள்

More Telugu News