హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. ఆ ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేయవద్దు!
- ఎల్లుండి హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ
- బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఆంక్షలు
- రేపు అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు అమల్లో ఆంక్షలు
- డ్రోన్లు, పారా గ్లైడర్లను ఎగురవేయడం నిషేధం
బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి 24 గంటల పాటు డ్రోన్‌లు, పారాగ్లైడర్‌లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ విమానాలు ఎగురవేయడాన్ని నిషేధించారు. ఈ మేరకు మల్కాజ్‌గిరి పోలీసులు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పౌరులు ఆంక్షలను పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.