టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఆ మూడు పార్టీల సమ్మతి.. ఈ సాయంత్రం గవర్నర్ వద్దకు విజయ్

Vijay to Meet Governor with Support of Three Parties
  • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక
  • సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్న నటుడు విజయ్
  • అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే
  • కాంగ్రెస్ తర్వాత మద్దతు ప్రకటించిన వామపక్ష, దళిత పార్టీలు
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. విజయ్ రెండు చోట్ల గెలవడం వల్ల ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా టీవీకే బలం 107 మాత్రమే. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించడంతో టీవీకే బలం 112కు చేరింది. తాజాగా వీసీకే (2), సీపీఐ (2), సీపీఎం (2) పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఆ సంఖ్య 118కి చేరింది. దాంతో మ్యాజిక్ ఫిగర్ ను అందుకున్నట్టయింది.

దీనికి సంబంధించిన వీసీకే, సీపీఐ, సీపీఎం నుంచి అధికారిక ప్రకటన ఈ సాయంత్రం వెలువడనుందని సమాచారం. ఎమ్మెల్యేల మద్దతు లేఖతో విజయ్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
Go Back to Shorts
Vijay
Tamilaga Vetri Kazhagam
TVK
Tamil Nadu Politics
CPI
CPM
VCK
Government Formation
Assembly Elections
Left Parties Support

More Telugu News