రామ్ చరణ్ 'పెద్ది' సెట్స్ పై చిరంజీవి సందడి... వీడియో ఇదిగో!
- రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సెట్స్‌ను సందర్శించిన మెగాస్టార్ చిరంజీవి
- చిరంజీవిని తన బాస్, గురువు అంటూ పోస్ట్ పెట్టిన దర్శకుడు బుచ్చిబాబు సానా
- రామ్ చరణ్ స్ఫూర్తితో తాను కూడా కండలు పెంచానంటూ దర్శకుడి సరదా వ్యాఖ్య
- జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు.
ఈ సందర్భంగా బుచ్చిబాబు ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. చిరంజీవిని ఉద్దేశిస్తూ, "పెద్ది సెట్స్‌లో బాస్ మరియు నా గురువు. ఇది నా జీవితంలో అత్యుత్తమ జ్ఞాపకాలలో ఒకటి. అవును.. 'పెద్ది' స్ఫూర్తితో నేను కూడా కొంచెం కండలు పెంచాను" అని పేర్కొన్నారు. తన అభిమాన హీరో, గురువు సెట్‌కు రావడంతో బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, చిరంజీవితో పాటు దర్శకుడు సుకుమార్ కూడా 'పెద్ది' సెట్స్ ను సందర్శించారు.
రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.