ఆపరేషన్ ముగియలేదు: ఆపరేషన్ సిందూర్‌కు ఏడాదైన సందర్భంగా త్రివిధ దళాల ప్రకటన

Operation Sindoor Not Over Says Indian Armed Forces
  • ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమే అన్న త్రివిధ దళాలు
  • దేశ ప్రజలను, సార్వభౌమత్వాన్ని భారత్ కాపాడుకోగలదని ఆపరేషన్ స్పష్టం చేసిందని వెల్లడి
  • పాక్‌‍లో ఏ ఉగ్రస్థావరం సురక్షితం కాదని ఆపరేషన్ ద్వారా సందేశమిచ్చామని వెల్లడి
ఉగ్రస్థావరాలపై భారత్ ఆపరేషన్ ఇంకా ముగియలేదని, ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమేనని భారత త్రివిధ దళాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్‌లో ఏ ఉగ్రస్థావరం సురక్షితం కాదని గత సంవత్సరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చామని తెలిపాయి. దేశ ప్రజలను, సార్వభౌమత్వాన్ని భారత్ కాపాడుకోగలదని స్పష్టం చేశాయి. ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా జైపూర్‌లో త్రివిధ దళాల ముఖ్య అధికారులు మీడియాతో మాట్లాడారు.

ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగిస్తుందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. వివిధ విభాగాలతో కలిసి తక్కువ సమయంలో, కచ్చితత్వంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. వైమానిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ ద్వారా మన వాయుసేన సామర్థ్యాలను ప్రపంచానికి మరోసారి చాటామని అన్నారు. పాకిస్థాన్ కు చెందిన 13 విమానాలను కూల్చివేశామని, 11 ఎయిర్ ఫీల్డ్ లను ధ్వంసం చేశామని వెల్లడించారు. 
Go Back to Shorts
Operation Sindoor
Indian Armed Forces
Pakistan Terrorist Camps
Lieutenant General Rajeev Ghai

More Telugu News