ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా, సాధారణ ట్రాఫిక్‌లో రేవంత్ కాన్వాయ్ ప్రయాణం... వీడియో ఇదిగో!

Revanth Reddy Convoy Travels in Normal Traffic
  • శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లో కాన్వాయ్
  • ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయకుండా ఒకే లైన్‌లో వాహనాలను కదలడానికి అనుమతి
  • తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టవద్దని రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించింది. ఆయన కాన్వాయ్ కోసం ఎక్కడా ట్రాఫిక్‌ను నిలిపివేయలేదు. తన కాన్వాయ్ కోసం సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దని, వాహనాలను ఆపవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గురువారం ఆయన కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్‌లో ప్రయాణించింది. విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే వెళ్లడం గమనార్హం. ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడానికి బదులు ఒక లైన్‌లో వాహనాలను అనుమతించాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో, పోలీసు అధికారులు ఈరోజు దానిని పాటించారు. ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా పోలీసులు వాహనాలను ఒకే లైన్‌లో కదలడానికి అనుమతించారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana CM
Telangana Chief Minister
Convoy
Traffic
Shamshabad Airport
Jubilee Hills

More Telugu News