తమిళ రాజకీయాల్లో మా పాత్ర లేదు.. బీజేపీ కీలక ప్రకటన
- తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
- టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు... 113కి పెరిగిన బలం
- అధికారానికి అవసరమైన మెజారిటీకి 5 సీట్ల దూరంలో విజయ్ పార్టీ
- విజయ్‌కు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై గవర్నర్‌కు అనుమానాలు
- ఈ పరిణామాలతో తమకు సంబంధం లేదన్న బీజేపీ
- విజయ్‌పై ఎలాంటి ఒత్తిడి తేవట్లేదని స్పష్టం చేసిన కమలదళం
తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీకి దూరంగా నిలిచింది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ ప్రమేయం ఏమీ లేదని బీజేపీ స్పష్టం చేసింది.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, టీవీకే 108 స్థానాలనే గెలుచుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ఆ సంఖ్య 113కు చేరింది. మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కోసం టీవీకే.. వీసీకే, వామపక్షాల వంటి చిన్న పార్టీలతో చర్చలు జరుపుతోంది.
ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ విజయ్ గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్‌ను రెండుసార్లు కలిశారు. అయితే, సంకీర్ణ ప్రభుత్వానికి అవసరమైన పూర్తి మద్దతు ఉందని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. మెజారిటీ లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని, మద్దతిచ్చే ఇతర పార్టీల నుంచి స్పష్టమైన హామీలు ఎక్కడని గవర్నర్ విజయ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి సమాధానంగా తాను ఫ్లోర్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని విజయ్ గవర్నర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ... "ఇది మిశ్రమ తీర్పు. టీవీకేకి పూర్తి మెజారిటీ లేదు. వారు తమ మెజారిటీని నిరూపించుకోవాలి. అలా చేస్తే, గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు" అని ఆయన తెలిపారు. విజయ్ బీజేపీని వ్యతిరేకిస్తున్నందుకే ఆయనపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలను నారాయణన్ తిరుపతి ఖండించారు. "ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతీది ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుంది. ఇలాంటి ఆరోపణలు కేవలం రాజకీయ వాక్చాతుర్యం మాత్రమే" అని ఆయన స్పష్టం చేశారు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంపైనే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు భవిష్యత్తు ఆధారపడి ఉంది.