హైదరాబాద్‌లో రూ.85 వేల కోట్ల విలువైన భూములు కాపాడాం: హైడ్రా కమిషనర్

  • హైడ్రా పరిధిలో రూ.10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురయ్యాయన్న రంగనాథ్
  • హైడ్రాను తెలంగాణవ్యాప్తంగా విస్తరిస్తామన్న రంగనాథ్
  • సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణిని నాలుగు వారాలపాటు నిలిపివేశామని వెల్లడి
హైదరాబాద్ నగరంలో కబ్జాల నుంచి సుమారు రూ.85 వేల కోట్ల విలువైన భూములను కాపాడామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ప్రస్తుతం హైడ్రా పరిధిలో రూ.10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైనట్లు తమకు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఆయన ఈరోజు మిర్యాలగూడలో పర్యటించి, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైడ్రాను తెలంగాణవ్యాప్తంగా విస్తరిస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. హైదరాబాద్‌లో హైడ్రా కార్యకలాపాలకు ప్రజలంతా ఆకర్షితులయ్యారని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కావాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. 

కబ్జాలపై హైడ్రాకు వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఆయా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తాము చర్యలు చేపడుతున్నామని అన్నారు. అందుకే నాలుగు వారాల పాటు ప్రజావాణిని నిలిపివేసినట్లు తెలిపారు. ఇప్పుడున్న దరఖాస్తుల పరిష్కారం కోసమే ప్రజావాణిని రద్దు చేశామని స్పష్టం చేశారు. హైడ్రాకు వ్యతిరేకంగా కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు.

Ranganath
HYDRA
Hyderabad
Telangana
Land Grabbing
Land Protection
Real Estate
Miryalaguda

More Telugu News