టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి ఆమోదం
- ఖమ్మంలో 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం
- వేసవి రద్దీ దృష్ట్యా జులై 15 వరకు సిఫార్సు లేఖలపై దర్శనాల రద్దు
- టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా ప్రముఖ గాయని శోభరాజు నియామకం
- ఉద్యోగుల ఆరోగ్య బీమా రీయింబర్స్‌మెంట్ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
- తిరుమలలో పలు అభివృద్ధి పనులకు భారీగా నిధుల కేటాయింపు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని ఖమ్మంలో 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి జులై 15 వరకు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
భక్తుల సౌకర్యాల మెరుగుదలకు పెద్దపీట వేస్తూ తిరుమలలోని వరాహస్వామి గెస్ట్ హౌస్-1 అభివృద్ధికి రూ.3.61 కోట్లు, అలిపిరి వద్ద బస్సుల తనిఖీ కోసం శాశ్వత షెడ్ల నిర్మాణానికి రూ.4.25 కోట్లు కేటాయించారు. సర్వదర్శనం క్యూలైన్లలో అదనపు టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.4.55 కోట్లకు ఆమోదం తెలిపారు.
ప్రముఖ గాయని, పద్మశ్రీ డాక్టర్ శోభరాజును టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా నియమిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా హెల్త్ స్కీం రీయింబర్స్‌మెంట్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా దర్శనం, లడ్డూ ప్రసాదం అందించాలని నిర్ణయించారు.
ఇతర ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం కోసం అందించే ఆర్థిక సహాయాన్ని రూ.5,000 నుంచి రూ. 10,000కు పెంచారు. వీటితో పాటు సత్యసాయి జిల్లా లేపాక్షిలో కల్యాణ మండపం, అమరావతి వెంకటపాలెంలో ఆలయ అభివృద్ధి పనులకు కూడా నిధులు మంజూరు చేశారు.