పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సన్‌రైజర్స్

  • 20 ఓవర్లలో 235 పరుగులు చేసిన హైదరాబాద్
  • భారీ లక్ష్యంతో బరిలోకి దిగి 202 పరుగులకే కుప్పకూలిన పంజాబ్
  • 107 పరుగులతో రాణించిన కూపర్ కానెల్లీ
ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించే ప్రదర్శన కనబరచలేదు. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులకే పంజాబ్ కుప్పకూలింది.

పంజాబ్ బ్యాట్స్‌మెన్ కూపర్ కానెల్లి ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లోనే 107 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ జట్టులో మిగిలిన ఆటగాళ్లు ఎవరూ రాణించలేదు. ఈ గెలుపుతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో పంజాబ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వచ్చింది. 11 మ్యాచ్‌లకు గాను 7 మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ రెండో స్థానానికి పడిపోయింది.

Sunrisers Hyderabad
SRH
Punjab Kings
IPL 2024
Hyderabad vs Punjab
Uppal Stadium
Cooper Connelly

More Telugu News