పంజాబ్ పేలవ ఫీల్డింగ్... రెచ్చిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్

  • 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసిన హైదరాబాద్
  • మూడుసార్లు క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌ను మిస్ చేసుకున్న పంజాబ్
  • రాణించిన అభిషేక్, ట్రావిస్, ఇషాన్, క్లాసెన్
ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసి, ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ జట్టు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్‌లో తేలిపోయింది. దీంతో హైదరాబాద్ భారీ పరుగులు సాధించింది.

ఓపెనర్లు అభిషేక్ శర్మ 13 బంతుల్లో రెండు పోర్లు, రెండు సిక్సులతో 35 పరుగులు, ట్రావిస్ హెడ్ 19 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సులతో 38 పరుగులతో ఆరంభంలోనే అదరగొట్టారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 55 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (43 బంతుల్లో 69 పరుగులు), నితీశ్ రెడ్డి (13 బంతుల్లో 29 పరుగులు నాటౌట్)తో ఆకట్టుకున్నారు.

పంజాబ్ ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌ను మిస్ చేశారు. క్లాసెన్, ఇషాన్‌లు ప్రారంభంలోనే క్యాచ్‌లు ఇవ్వగా పంజాబ్ ఆటగాళ్లు జారవిడిచారు. 19 పరుగుల వద్ద ఇషాన్ మరోసారి ఇచ్చిన క్యాచ్‌ను ఫెర్గూసన్ పట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఇషాన్‌ను స్టంపింగ్ చేసే అవకాశాన్ని కూడా చేజార్చుకుంది. 236 పరుగుల లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగింది.

Sunrisers Hyderabad
IPL 2026
Punjab Kings
Travis Head
Abhishek Sharma
Heinrich Klaasen

More Telugu News