కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
- మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
- హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోనున్నట్లు వెల్లడి
- అరగంట పాటు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు సుమారు అరగంట పాటు సమావేశమై, వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
హైదరాబాద్ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోనున్నట్లు కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మెట్రో రెండో దశ డీపీఆర్‌ను వెంటనే ఆమోదించాలని కోరారు. శంషాబాద్ విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను ఫేజ్-3 కింద చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు.