వినూత్న సమస్యతో బాధపడుతున్న కండక్టర్‌కు అండగా టీజీఎస్ఆర్టీసీ
- అసాధారణ ఎత్తు కారణంగా విధుల్లో ఇబ్బంది పడుతున్న కండక్టర్‌కు ఊరట
- బస్సు ఎత్తు కంటే తన ఎత్తు ఎక్కువ ఉండటంతో మెడ, నడుము నొప్పులతో వేదన
- కండక్టర్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- శాశ్వత ప్రాతిపదికన ప్రత్యామ్నాయ విధులకు బదిలీ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ ఆదేశాలు
- మానవతా దృక్పథంతో స్పందించిన యాజమాన్యంపై సర్వత్రా ప్రశంసలు
అసాధారణమైన తన ఎత్తు కారణంగా విధుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ బస్ కండక్టర్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) అండగా నిలిచింది. మానవతా దృక్పథంతో అతడి సమస్యను అర్థం చేసుకుని, ప్రత్యామ్నాయ విధులను కేటాయించి పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని మెహిదీపట్నం డిపోలో అమీన్ అహ్మద్ అన్సారీ బస్ కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఎత్తు 6.5 అడుగులు (198 సెం.మీ.). అయితే, సాధారణంగా బస్సుల్లోని అంతర్గత ఎత్తు కేవలం 6.4 అడుగులు మాత్రమే ఉంటుంది. దీంతో బస్సులో టికెట్లు ఇచ్చేందుకు తిరిగేటప్పుడు ఆయన నిత్యం వంగి ఉండాల్సి వచ్చేది. సుమారు 10 గంటల షిఫ్ట్‌లో కనీసం ఐదు ట్రిప్పులు వేయాల్సి ఉండటంతో ఆయన తీవ్రమైన మెడ, నడుము నొప్పులతో బాధపడేవారు.
ఈ శారీరక ఇబ్బందుల కారణంగా తనను వేరే విధులకు మార్చాలని అన్సారీ యాజమాన్యాన్ని అభ్యర్థించారు. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన యాజమాన్యం గతంలో ఏడాది పాటు తాత్కాలికంగా ఇతర విధులను కేటాయించింది. ఏప్రిల్ 28తో ఆ గడువు ముగియడంతో అన్సారీ పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం చూపింది.
అతడి సేవలను టీజీఎస్ఆర్టీసీ బస్ పాస్ విభాగంలో గానీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) కౌంటర్లలో గానీ అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలని యాజమాన్యం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకం కింద 2021లో ఉద్యోగం పొందిన అన్సారీకి ఈ నిర్ణయం గొప్ప ఊరటనిచ్చింది. కండక్టర్‌గా పనిచేస్తూ మరణించిన తన తండ్రి స్థానంలో అన్సారీ ఉద్యోగంలో చేరారు. ఒక ఉద్యోగి ఎదుర్కొంటున్న వినూత్న సమస్యకు మానవత్వంతో స్పందించిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.