ఆర్ బీ చౌదరి మృతికి ప్రముఖుల సంతాపాలు

RB Choudary Passes Away Condolences Pour In
  • ఆర్బీ చౌదరి మృతి పట్ల పవన్, చిరంజీవి, రజనీకాంత్ సంతాపం
  • తాను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని ఆయనే నిర్మించారన్న పవన్ కల్యాణ్
  • 'గాడ్‌ఫాదర్‌'కు కలిసి పనిచేశామన్న చిరంజీవి
  • ఆర్బీ ఎందరో యువ దర్శకులకు అవకాశాలిచ్చారన్న రజనీకాంత్
ప్రముఖ చలనచిత్ర నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బీ చౌదరి (76) అకాల మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఈ వార్త తెలియగానే దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు ఆయన ఎంతో కృషి చేశారంటూ కొనియాడారు.

ఆయన మరణం పట్ల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని ఆయనే నిర్మించారని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, "ఆర్‌బీ చౌదరి గారి ఆకస్మిక మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. మేం కలిసి 'గాడ్‌ఫాదర్‌'కు పనిచేశాం," అని గుర్తుచేసుకున్నారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్, "నా స్నేహితుడు ఆర్బీ చౌదరి గొప్ప నిర్మాత. ఎందరో యువ దర్శకులకు అవకాశాలిచ్చారు" అని అన్నారు. "సూర్యవంశం, రాజా వంటి చిత్రాల్లో ఆయన బ్యానర్‌లో నటించడం నా అదృష్టం" అని వెంకటేశ్ అన్నారు. ఆర్బీ చౌదరి మరణ వార్త షాకింగ్ కు గురి చేసిందని విశాల్ పేర్కొన్నారు.
Go Back to Shorts
RB Choudary
Super Good Films
Telugu film producer
Pawan Kalyan
Chiranjeevi
Rajinikanth
Venkatesh
Vishal
film industry
South Indian cinema

More Telugu News