భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు.. రియల్టర్లూ ఇది తెలుసుకోండి!
- దేశంలో ‘నేషనల్ బిల్డింగ్ కోడ్’ స్థానంలో కొత్తగా ‘నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్’
- అగ్ని భద్రత నిబంధనలు తప్పనిసరి నుంచి సలహాగా మార్పు
- నిబంధనల వర్తింపు ఎత్తును 15 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచిన ప్రభుత్వం
- నిర్మాణ రంగంలో ఆవిష్కరణలు, సౌలభ్యమే లక్ష్యమని వెల్లడి
- ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా అగ్ని భద్రత నిబంధనలు రూపొందించుకోవాలి
దేశవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘నేషనల్ బిల్డింగ్ కోడ్’ (NBC)ను ఉపసంహరించి, దాని స్థానంలో ‘నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్’ (NBCS)ను ప్రవేశపెట్టింది. మే 1న నోటిఫై చేసిన ఈ కొత్త ప్రమాణాల ద్వారా, ముఖ్యంగా అగ్ని మరియు జీవన భద్రతకు సంబంధించిన నిబంధనల్లో ప్రభుత్వం గణనీయమైన మార్పులు చేసింది. గతంలో తప్పనిసరిగా ఉన్న ఈ నియమాలు, ఇప్పుడు కేవలం సలహా పూర్వకంగా మారాయి. నిర్మాణ రంగంలో మరింత సౌలభ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ మార్పుల లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
క్యాబినెట్ సెక్రటేరియట్లోని డీరెగ్యులేషన్ సెల్ సూచనల మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ మార్పులను చేపట్టింది. NBCలోని ‘కోడ్’ అనే పదం చట్టపరమైన బంధనాన్ని సూచిస్తోందని, దీనివల్ల తరచూ కోర్టు కేసులకు దారితీస్తోందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో, ఆ పదాన్ని తొలగించి ‘స్టాండర్డ్స్’గా మార్చారు. దీంతో ఈ నిబంధనలు ఇకపై స్వచ్ఛంద మార్గదర్శకాలుగా ఉంటాయి.
ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది అగ్ని భద్రతకు సంబంధించిన విభాగం. నిజానికి, ఈ విభాగాన్ని పూర్తిగా తొలగించాలని డీరెగ్యులేషన్ సెల్ మొదట సూచించింది. అయితే, అగ్నిమాపక భద్రతా నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిని NBCSలో కొనసాగించారు. కానీ, నిబంధనల స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు.
గతంలో NBCలో ఉన్న ‘shall’ (తప్పనిసరి) అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘should’ (చేయాలి/ఆకాంక్షనీయం) అనే పదాన్ని చేర్చారు. అంటే, ఇకపై ఈ నియమాలు చట్టబద్ధంగా పాటించాల్సినవి కావు. అంతేకాకుండా, గతంలో 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న నివాస భవనాలకు వర్తించే అగ్ని భద్రతా నియమాలను, ఇప్పుడు 24 మీటర్లు (దాదాపు 8 అంతస్తులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలకు మాత్రమే పరిమితం చేశారు.
నిర్మాణం రాష్ట్ర పరిధిలోని అంశం కావడంతో, ఎత్తు, స్థల అవసరాలు, నిర్వహణ వంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలే తుది నిర్ణయాలు తీసుకోవాలని కొత్త ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలోని కఠినమైన నియమాల (ప్రిస్క్రిప్టివ్) స్థానంలో, ఫలితాలపై ఆధారపడిన (పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్) విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది వినూత్న డిజైన్లకు, ఆధునిక సాంకేతికత వినియోగానికి అవకాశం కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
అయితే, ఈ మార్పుల వల్ల రాష్ట్ర అగ్నిమాపక శాఖలపై బాధ్యత మరింత పెరిగింది. ఇకపై వారు జాతీయ ప్రమాణాలను నేరుగా ఉటంకించలేరు. ప్రతి రాష్ట్రం తమ అవసరాలకు అనుగుణంగా సొంతంగా వివరణాత్మక నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో జాప్యం జరిగినా, నిబంధనలను బలహీనపరిచినా భవనాల్లో నివసించే ప్రజల భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.