కేరళ సీఎం రేసులో ముగ్గురు నేతలు!
- కేరళలో యూడీఎఫ్ విజయం
- సీఎం రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్
- కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ఘనవిజయం సాధించడంతో, తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు రేసులో ఉండటంతో హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ముగ్గురు నేతలూ నాయర్ సామాజిక వర్గానికి చెందిన వారే.
సీఎం రేసులో ఉన్న ముగ్గురు నేతలు:
రమేశ్ చెన్నితాల (69): సీనియర్ నేత, మాజీ హోం మంత్రి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, కూటమి పార్టీల మద్దతు, సామాజిక వర్గంలో పట్టు.కేసీ వేణుగోపాల్ (63): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, పార్టీని సమన్వయ పరచడంలో దిట్ట.
వీడీ సతీశన్ (62): ప్రతిపక్ష నేత. పినరయి విజయన్‌ను దీటుగా ఎదుర్కొన్న వ్యక్తి, యువతలో మంచి క్రేజ్.