వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన పేస‌ర్ కైల్ జెమీసన్‌కు షాక్‌!

IPL Action Against Kyle Jamieson for Vaibhav Suryavanshi Incident
  • యువ బ్యాటర్‌పై దూకుడుగా ప్రవర్తించిన కైల్ జెమీసన్
  • ఒక డీమెరిట్ పాయింట్, హెచ్చరిక జారీ చేసిన ఐపీఎల్
  • రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో జరిగిన ఘటన
  • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కివీస్ పేసర్
  • తన తప్పును అంగీకరించినట్లు తెలిపిన ఐపీఎల్
ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీసన్‌పై ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పట్ల దూకుడుగా ప్రవర్తించినందుకు అతనికి ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు అధికారిక హెచ్చరిక జారీ చేశారు. నిన్న‌ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజస్థాన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో 15 ఏళ్ల వైభవ్‌ను ఔట్ చేసిన తర్వాత జెమీసన్ అతని వద్దకు దూకుడుగా దూసుకెళ్లి రెచ్చగొట్టేలా వీడ్కోలు పలికాడు. ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించడమేనని ఐపీఎల్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తోటి ఆటగాడిని కించపరిచేలా లేదా రెచ్చగొట్టేలా భాష, చర్యలు లేదా సంజ్ఞలు ఉపయోగించడాన్ని ఈ నిబంధన నిషేధిస్తుంది.

ఈ ఉల్లంఘన కారణంగా జెమీసన్‌కు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ విధించిన ఈ శిక్షను కివీస్ పేసర్ అంగీకరించాడని, తన తప్పును ఒప్పుకున్నాడని ఐపీఎల్ ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ వ్యవహారంపై తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది.
Go Back to Shorts
Kyle Jamieson
Vaibhav Suryavanshi
IPL
Delhi Capitals
Rajasthan Royals
Rajiv Seth
Sawai Mansingh Stadium
IPL Code of Conduct

More Telugu News