మమతా బెనర్జీ కదలికలపై నిఘా ఉంచాం: సువేందు అధికారి

Suvendu Adhikari claims Mamata Banerjee is under surveillance
  • అవకతవకలు జరగకుండా చూసేందుకు చర్యలు చేపట్టామన్న సువేందు
  • మమతా స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్నంతసేపు ఏజెంట్ ఆమె కదలికలను గమనిస్తూనే ఉన్నారని వెల్లడి
  • నిబంధనలు ఉల్లంఘించకుండా అడ్డుకున్నామన్న సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కదలికలపై నిఘా ఉంచామని ప్రతిపక్ష నేత సువేందు అధికారి తెలిపారు. నిన్న భవానీపూర్‌లోని ఓ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లో మమతా బెనర్జీ దాదాపు నాలుగు గంటల పాటు ఉన్నారు. దీనిపై సువేందు స్పందించారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు నిఘా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

మమతా బెనర్జీ అక్కడ ఉన్నంతసేపు తమ ఏజెంట్ ఆమె కదలికలను గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇతర ప్రాంతాలలోని స్ట్రాంగ్ రూంల వద్ద కూడా తమ నేతలు నిఘా ఉంచారని పేర్కొన్నారు. ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించకుండా తాము అడ్డుకున్నామని వెల్లడించారు.
Go Back to Shorts
Mamata Banerjee
Suvendu Adhikari
West Bengal
Bhabanipur
TMC
EVM strong room
Election Commission

More Telugu News