మా అమ్మ అలా చనిపోయిందని అంటారు: రవిబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా అమ్మ అలా చనిపోయిందని అంటారు: రవిబాబు

Ravibabu Interview
  • నటుడిగా, దర్శకుడిగా రవిబాబుకి పేరు
  • కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే రవిబాబు 
  • తల్లి మరణం గురించిన ప్రస్తావన 
  • తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోలేదని వ్యాఖ్య  
    
నటుడిగా .. దర్శకుడిగా రవిబాబుకి మంచి పేరు ఉంది. సీనియర్ నటుడు చలపతిరావుకి కొడుకైన రవిబాబు, తన టాలెంట్ ను నమ్ముకుని అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తక్కువ బడ్జెట్ లో .. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను అందించడం రవిబాబు ప్రత్యేకతగా కనిపిస్తుంది. దర్శకుడిగా .. నటుడిగా కూడా కొత్తదనం లేకపోతే ఆయన ఆ ప్రాజెక్టును ఒప్పుకోరు. అలాంటి రవిబాబు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్యూలో, తన తల్లి చనిపోవడాన్ని గురించి ప్రస్తావించారు.  

"మా అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని .. నాకు ఏమీ తెలియదు. ఈ విషయాన్ని గురించి ఆ తరువాత నేను నాన్నను ఎప్పుడూ అడగలేదు .. ఆయన చెప్పలేదు. కానీ కొంతమంది చెప్పినదానిని బట్టి, మా అమ్మ ఎలా చనిపోయిందనే విషయంలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. అనుకోకుండా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె చనిపోయింది. తెల్లవారు జామున 'టి' పెడుతూ ఉండగా, ఆమె చీరకి నిప్పు అంటుకుంది" అని అన్నారు. 

' మా అమ్మకి చీరకి నిప్పు అంటుకుని కాలిపోతుండగా, ఆ కంగారులో మా ఫాదర్ ఆమెపై నీళ్లు పోశారు. అలా పోయకూడదని ఆయనకి తెలియదు. ఏ దుప్పటో చుట్టేసి మంటలు ఆర్పడానికి ట్రై చేయాల్సింది. హాస్పిటల్లో 3 రోజుల పాటు ఉన్న తరువాత అమ్మ చనిపోయింది. అప్పటికి నాన్న వయసు 30 లోపే. మళ్లీ పెళ్లి చేసుకోమని చాలామంది సలహా ఇచ్చినప్పటికీ ఆయన వినిపించుకోలేదు' అని అన్నారు. 

Advertisement
-

More Telugu News