వైసీపీ హయాంలోనే ఎక్కువ సంక్షేమం జరిగిందని నిరూపించే దమ్ము జగన్ అండ్ కోకు ఉందా?: పార్థసారథి

Parthasathi fires on Jagan and YSRCP
  • కారకంపాడులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేసిన పార్థసారథి, వర్ల కుమార్ రాజా
  • కూటమి ప్రభుత్వం పేదల సేవకే అంకితమయిందని వ్యాఖ్య
  • అబద్ధాలను నిజం చేసేలా జగన్ అండ్ కో ప్రచారం చేస్తున్నారని మండిపాటు

మేడే సందర్భంగా కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్, వైసీపీ నేతలు అబద్ధాలను నిజం చేసేలా 'గోబెల్స్' ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం కంటే వైసీపీ హయాంలోనే ఎక్కువ సంక్షేమం జరిగిందని నిరూపించే దమ్ము జగన్ అండ్ కోకు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు. ఏ గ్రామానికైనా వచ్చి చర్చించడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు.


మేడే సందర్భంగా మొవ్వ మండలం కారకంపాడులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి మంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెల 1వ తేదీని ఒక కార్యక్రమంగా భావించి పేదలకు పింఛన్లు అందజేస్తున్నారని, కూటమి ప్రభుత్వం పేదల సేవకే అంకితమైందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పిల్లల భవిష్యత్తే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. 

అందరికీ అమ్మ ఒడి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక జగన్ మడమ తిప్పారని పార్థసారథి ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉండేవని, ఇప్పుడు కూటమి పాలనలో మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్లు వేస్తూ రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
Go Back to Shorts
Parthasarathi
TDP
Jagan
YSRCP

More Telugu News