ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ సంచలనం.. విజయ్ టీవీకే పార్టీకి 120 సీట్లు
- టీవీకేకు 120 సీట్ల వరకు ఛాన్స్
- డీఎంకే కూటమికి ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ షాక్
- కింగ్ మేకర్‌గా మారనున్న నటుడు విజయ్
- సోమవారం వెలువడనున్న తుది ఫలితాలు
హోరాహోరీగా సాగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ‘డీఎంకే’ పార్టీనే మళ్లీ అధికారంలోకి రానున్నట్లు మెజారిటీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. కానీ, ఎన్డీటీవీ-యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం రాష్ట్రంలో పెను సంచలనం నమోదు కాబోతున్నట్లు వెల్లడించింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) తన తొలి ఎన్నికల సమయంలోనే అధికార డీఎంకే కూటమికి గట్టి పోటీనిస్తూ కింగ్‌మేకర్‌గా అవతరించనున్నట్లు తెలిపింది.
ఎన్డీటీవీ-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 98 నుంచి 120 స్థానాలను కైవసం చేసుకోనుంది. డీఎంకే కూటమి 92-110, ఏఐఏడీఎంకే కూటమి 22-32 సీట్లు దక్కించుకుంటాయని అంచనా వేసింది. ఇదే నిజమైతే దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే రాజకీయాలకు తెరపడి కొత్త శకం మొదలవుతుంది. కనిష్ఠంగా 98 సీట్లు గెలుచుకున్నా విజయ్ పార్టీ కింగ్ మేకర్‌గా లేదా ప్రధాన శక్తిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. సోమవారం తుది ఫలితాలు వెలువడనున్నాయి.
ఇతర సర్వేల అంచనాలు
పీపుల్స్ పల్స్: డీఎంకే కూటమికి 125-145, ఏఐఏడీఎంకేకు 65-80 సీట్లు.
ప్రజా పోల్: డీఎంకే కూటమికి 148-168 స్థానాలు వస్తాయని, టీవీకే కేవలం 1-9 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది.
కామాఖ్య అనలిటిక్స్: డీఎంకే (78-95), ఏఐఏడీఎంకే (68-84) సీట్లతో పాటు విజయ్ పార్టీకి 67-81 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
జేవీసీ: ఈ సంస్థ మాత్రం ఏఐఏడీఎంకే కూటమికి అత్యధికంగా 128-147 సీట్లు వస్తాయని భిన్నమైన ఫలితాన్ని ఇచ్చింది.