అషు రెడ్డి కేసులో ఆడియో లీక్.. ధర్మేంద్రకు వార్నింగ్!

ashu reddy audio leak viral in social media
  • పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం చేశారంటూ అషు రెడ్డిపై ఆరోపణలు
  • కేసులో కీలకమైన ఆడియో టేపులు ఆన్‌లైన్‌లో లీక్
  • బాధితుడు ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఆడియో
  • కోటిన్నర తిరిగిస్తా.. మిగతాది తర్వాత చూస్తానంటూ ఆడియోలో సంభాషణ
నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితుడైన ఎన్నారై ధర్మేంద్రను అషు రెడ్డి హెచ్చరిస్తున్నట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

లీకైన ఆడియో ప్రకారం.. ధర్మేంద్ర నుంచి తీసుకున్న డబ్బులో రూ.1.5 కోట్లను మే నెలలో తిరిగి ఇస్తానని, మిగిలిన మొత్తం తాను జీవితంలో స్థిరపడ్డాక చెల్లిస్తానని అషు రెడ్డి చెప్పినట్లుగా ఉంది. తన కుటుంబ సభ్యులను ఈ వివాదంలోకి లాగితే, వేధింపుల కింద ఎదురు కేసు పెడతానని హెచ్చరించినట్లు సమాచారం. నటి ప్రవీణ, జ్యోతిష్యుడు వేణు స్వామి మధ్యవర్తిత్వంలో ఈ విషయాన్ని పరిష్కరించుకుందామని కూడా ఆ ఆడియోలో ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి.

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర అలియాస్ వెంకట్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అషు రెడ్డి 2018 నుంచి సుమారు రూ.9.35 కోట్లు, 5 కిలోల బంగారం, లగ్జరీ కార్లు, ఫ్లాట్లు తీసుకున్నారని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

తాజా పరిణామాలతో అషు రెడ్డి ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, ఈ ఆడియో టేపుల వాస్తవికతను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Go Back to Shorts
Ashu Reddy
audio leak
social media
NRI Dharmendra

More Telugu News