బైక్ ట్యాక్సీల నిషేధంపై వెనక్కితగ్గని కర్ణాటక.. సుప్రీంలో పిటిషన్
- బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు
- వాహనం బైక్ అయినంత మాత్రాన పర్మిట్ నిరాకరించరాదన్న కోర్టు
- వ్యాపార స్వేచ్ఛ హక్కుకు ఇది విఘాతమన్న హైకోర్టు డివిజన్ బెంచ్
- దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం
- ఓలా, ఉబెర్ వంటి అగ్రిగేటర్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు
కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలపై వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. ఈ సేవలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఏఎన్ఐ టెక్నాలజీస్, ఇతర క్యాబ్ అగ్రిగేటర్లకు వ్యతిరేకంగా గత వారం ఈ అప్పీల్ దాఖలు చేయగా త్వరలోనే ఇది విచారణకు రానుంది. ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి సంస్థలు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. కేవలం ద్విచక్ర వాహనం అయినందుకే పర్మిట్ నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సమగ్ర నియంత్రణ విధానం లేనందున బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఈ ధర్మాసనం కొట్టివేసింది.
మోటార్ వాహనాల చట్టం ప్రకారం మోటార్ సైకిళ్లు కూడా 'రవాణా వాహనాల' పరిధిలోకి వస్తాయని, వాటిని ట్యాక్సీలుగా పరిగణించకుండా మినహాయించలేరని ధర్మాసనం అభిప్రాయపడింది. బైక్ ట్యాక్సీలను నిషేధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(g) ప్రకారం సంక్రమించిన వృత్తి, వ్యాపార స్వేచ్ఛ హక్కును హరించడమే అవుతుందని పేర్కొంది.
అయితే, బైక్ ట్యాక్సీ కార్యకలాపాలను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 74(2) కింద షరతులు విధించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగింది.