‘ఏ ఫిల్మ్ బై గిరి ’.. రూటు మార్చిన 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి

  • 'కాంతార' చిత్రాల తర్వాత పూర్తి భిన్నమైన సినిమాతో వస్తున్న రిషబ్ శెట్టి
  • కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న 'ఏ ఫిల్మ్ బై గిరి'
  • మే 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల
  • తెలుగులో ఎం అచ్చిబాబు సమర్పణలో ఎంజీ మూవీస్ రిలీజ్
'కాంతార' చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు పూర్తి భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'ఏ ఫిల్మ్ బై గిరి'. ఇంటెన్స్ డ్రామా తర్వాత ఈసారి ఆయన పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌తో రూటు మార్చారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 8న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

స్టార్ వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్, రిషబ్ శెట్టి ఫిలిమ్స్ బ్యానర్లపై ఎన్ సందేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ప్రముఖ పంపిణీదారు ఎం అచ్చిబాబు సమర్పణలో ఎంజీ మూవీస్ సంస్థ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి సరసన రచన ఇందిర్ హీరోయిన్‌గా నటించగా, కరణ్ అనంత్, అనిరుద్ మహేష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

ఈ కామెడీ చిత్రంలో ఎన్.పి తపస్విని, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. వాసుకి వైభవ్ సంగీతం అందించగా, రఘునాథ్ సిఎం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. 'కాంతార' వంటి సీరియస్ చిత్రం తర్వాత రిషబ్ శెట్టి నుంచి వస్తున్న ఈ కామెడీ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి.

Rishab Shetty
A Film By Giri
New Movie
Release

More Telugu News